అఖిలభారత ప్రజానాట్యమండలి ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ (ఐపిటిఏ) ఆధ్వర్యంలో సెప్టెంబరు 28వ తారీఖున దేశ వ్యాప్తంగా ప్రారంభించిన పాదయాత్రలు స్నేహం, ప్రేమ, శాంతి, దయా, కరుణ, సమానత్వం, సమన్యాయం, సౌబ్రాతృత్వం కోసం జరుగుతున్న పాదయాత్రలకు సంఘీభావంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి (ఏపీపీఎన్ఎమ్) ఆధ్వర్యంలో డిసెంబర్ 19వ తేదీన కవులు కళాకారులు తో పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వర్లు (అన్న) జండా ఊపి పాదయాత్రలను ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర బాధ్యులు జంగాల అజయ్ కుమార్ గుంటూరు కళా పరిషత్ అధ్యక్షులు పూర్ణా , ఇఫ్ట జాతీయ కార్యదర్శి గని ఈ పాదయాత్ర ను గుంటూరు కొత్తపేటలోని భగత్ సింగ్ బొమ్మ దగ్గర నుంచి ప్రారంభించారు. పాదయాత్ర పెదకాకాని కి చేరుకొని అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ చేస్తున్నా రాష్ట్రవ్యాప్త సమ్మెకు ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి గా పాటలు పాడి మద్దతును తెలియజేయడమైనది, ఆ సర్కిల్ లో ఉన్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహం కు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఓ ప్రైవేట్ స్కూల్లో విద్యార్థులతో దేశభక్తి గీతాలు ఆలపించి వారితో ఇంట్రక్షన్స్ చేయడమైనది పెదకాకానిలో సిపిఐ పొన్నూరు నియోజకవర్గ కార్యదర్శి బుజ్జయ్య వారి బృందం మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు, భోజనానంతరం పెదకాకాని, నంబూరు, కంతేరు అడ్డరోడ్, కాజా, చిన్న కాకాని, మీదు గా మంగళగిరి నగరం లోనికి పాదయాత్ర పాత బస్టాండ్ వద్ద చేరుకోగానే మంగళగిరి నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, జాలాది, జాన్ బాబు, చిన్ని సత్యనారాయణ, గోహర్ జానీ, హనుమయ్య పూల వర్షం కురిపిస్తూ పాదయాత్రను స్వాగతించారు.
ఈ పాదయాత్ర కార్యక్రమంలో ఇఫ్టా జాతీయ కార్యదర్శి గని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య, అధ్యక్షలు పి చంద్ర నాయక్, కార్యనిర్వాహక కార్యదర్శి ఆర్ రామకృష్ణ కోశాధికారి ఆర్ పిచ్చయ్య రాష్ట్ర ఆఫీసు బేరర్స్ ఎస్కే నజీర్, ఎ శివయ్య, మహంత లక్ష్మణరావు ఆరేటి రామారావు సీతారాం ప్రసాద్ పోతురాజు నాగేశ్వరరావు డప్పు సూరి నాగభూషణం అనంతలక్ష్మి స్వర్ణ సులోచన తదితరులు ఉన్నారు.పెదకాకాని కి చేరుకొని అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ చేస్తున్నా రాష్ట్రవ్యాప్త సమ్మెకు ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలిగా పాటలు పాడి మద్దతును తెలియజేయడమైనది, ఓ ప్రైవేట్ స్కూల్లో విద్యార్థులతో దేశభక్తి గీతాలు ఆలపించి వారితో ఇంట్రక్షన్స్ చేయడమైనది పెదకాకానిలో బుజ్జయ్య మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు అక్కడ భోజనానంతరం గ్రామాల మీదుగా మంగళగిరి కి చేరుకొని రాత్రి అక్కడ బస చేయడం జరిగింది.
2వ రోజు 20వ తేదీ మంగళగిరిలో పాదయాత్ర ఉదయం ఎనిమిది గంటలకే ప్రారంభించి భవన నిర్మాణ కార్మికులు తమ పని కోసం 400 మంది నాలుగు రోడ్ల సర్కిల్లో ఉన్నారు వారితో మమేకమై వారికి సంబంధించిన పాటలను పాడి పాదయాత్ర ముఖ్య ఉద్దేశాన్ని వారికి తెలియజేయడమైనది మరో మంగళగిరి అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచి గౌతమ బుద్ధ రోడ్డు మీదుగా డాన్ బాస్కో హైస్కూల్లో కరస్పాండెంట్ బాలకృష్ణ గారి సహకారంతో స్కూల్లో కూడా సమావేశం ఏర్పాటు చేసి దేశభక్తి గీతాలతో పాటు అమ్మా నాన్న ప్రాముఖ్యతను వివరిస్తూ పాటలు పాడడ మైనది 9 ,10 తరగతి విద్యార్థినులు తో పాటలు పాడించి పాదయాత్ర ఔనత్యాన్ని తెలియజేయడమైనది. ప్రకాష్ నగర్ అనేక గ్రామాలు నడుచుకుంటూ మధ్యాహ్నం రెండు గంటలకు నులక పేట కు చేరుకుని హోటల్లో భోజనం చేయడమైనది.
తరువాత ఉండవల్లి సెంటర్ మీదుగా ప్రకాశం బ్యారేజి, కనకదుర్గమ్మ అమ్మవారి గుడి, మీదుగా విజయవాడ భవాని పురం సెంటర్ కు సాయంత్రం నాలుగు గంటలకు చేరుకోవడంతో విజయవాడ నగర సిపిఐ కార్యదర్శి జి కోటేశ్వరరావు నాయకత్వంలో ప్రజానాట్యమండలి కళాకారులు సాదర స్వాగతం పలికారు అనంతరం జరిగిన ఆట పాట మాట బహిరంగసభ కు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యి దేశంలో జరుగుతున్న పాదయాత్రల పై ప్రశంసల జల్లులు కురిపించారు. ఈ బహిరంగ సభ కు పి చంద్రా నాయక్ అధ్యక్షత వహించారు.
సభలో లో సిపిఐ కృష్ణా జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ జాతీయ కార్యదర్శి గని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య తదితరులు ప్రసంగించారు. పాదయాత్రలో పాల్గొన్న ప్రజానాట్యమండలి నాయకులు కళాకారులకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు దోనేపూడి శంకర్ జి కోటేశ్వరరావు కళాకారులను శాలువాలు కప్పి సత్కరించారు . ఈ పాదయాత్రలో 25 మంది కళాకారులు రెండు రోజులపాటు పాల్గొనడం జరిగింది. ఈ రెండు రోజుల పాదయాత్రకు ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య బాధ్యత తీసుకొని పాదయాత్ర విజయవంతం కావడానికి కృషి చేయడం జరిగింది.
Report: చిన్నం పెంచలయ్య